మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Runa Vimochana Ganapati Stotram – శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం

స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే || 1 ||

ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || 2 ||

మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || 3 ||

కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ |
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే || 4 ||

రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || 5 ||

పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ |
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || 6 ||

ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || 7 ||

ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || 8 ||

ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి || 9 ||

ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..